- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీల్లోని వాణిజ్య సముదాయాలను వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వ్యతిరేకించారు.
గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. పేదల కోసం నిర్మించిన ఈ సముదాయాల నిర్వహణ భారం ప్రజలపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అప్పట్లో షాపులను నిర్మించారని గుర్తు చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 16 కాలనీల్లోని 992 షాపులను వేలం వేయాలని అడిషనల్ కలెక్టర్ నిర్ణయించడం సరికాదని, ఈ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
