గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి : జిల్లా కలెక్టర్ సత్యశారద

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు  వేయించాలి :  జిల్లా కలెక్టర్ సత్యశారద
  •     జిల్లా కలెక్టర్​ సత్యశారద

పర్వతగిరి(గీసుగొండ), వెలుగు:  రైతులు వ్యవసాయంతో పాటు పశుసంపదను కాపాడుకోవాలని  కలెక్టర్​ డాక్టర్​ సత్యశారద అన్నారు. వరంగల్​జిల్లా గీసుగొండ మండలం దసురుతండా, మంగళతండాలో గురువారం ప్రజా పాలన-ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను రైతులు సద్వినియోగం చే సుకోవాలన్నారు. గాలికుంటు వ్యాధి వలన కలిగే నష్టాలు, పాడి పశువుల ప్రాధాన్యత, వాటి ద్వారా మానవాళికి కలిగే లాభాలను ఆమె  వివరించారు. అనంతరం అవగాహన ప్రచార రథాన్ని  కలెక్టర్​ ప్రారభించారు.