హుస్నాబాద్ సంతకు మళ్లీ వేలం

హుస్నాబాద్ సంతకు మళ్లీ వేలం

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ అంగడి(సంత) గురువారం రీ-టెండర్ నిర్వహించారు. మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ దండి లక్ష్మి అధ్యక్షతన జరిగిన బహిరంగ వేలంలో ఉప్పుల రాంరెడ్డి రూ. 1.10 కోట్లతో సంత హక్కులను దక్కించుకున్నారు. ఈ నెల 18న జరిగిన టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ కాంట్రాక్టర్​ ఏకంగా రూ. 2 కోట్లు కోట్ చేశారు. 

నిబంధనల ప్రకారం 1/3 వంతు నగదును గడువులోగా కట్టకపోవడంతో మళ్లీ టెండర్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కాగా పాత కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపాజిట్ మొత్తాన్ని జప్తు చేసినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పద్మ, కౌన్సిలర్లు అనూష, లత, మంజుల, రమేశ్‌‌‌‌‌‌‌‌, శ్రీను, శోభన్, రాజు, పాల్గొన్నారు.