కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: ఘంటా చక్రపాణి

కేసీఆర్ పాలనలో  విద్యావ్యవస్థ నిర్వీర్యం: ఘంటా చక్రపాణి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత పదేండ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని టీఎస్ పీఎస్ సీ మాజీ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన ధర్మ టీచర్స్ యూనియన్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న వారంతా నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలేనని అన్నారు. తెలంగాణ పునర్ని ర్మాణం విద్యా రంగంతో ముడిపడి ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యా రంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరా రు.  

గత పదేండ్లలో విద్య అందని ద్రాక్ష గానే మిగిలిందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో యూనియన్ ప్రతినిధి కొండా ఆశన్న, విశారదన్ మహరాజ్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలి, ప్రొ. మురళి మనోహర్, ప్రొ. రామయ్య యాదవ్, రచయిత సౌదా అరుణ, లింగమయ్య యాదవ్, ఇంచార్జ్ లు దామెర ఉపేందర్, నాగరాణి, ఎన్ రమేశ్, పి.అశోక్, కె. రాజు, రవిచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.