3 కిలోల గంజాయి పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

3 కిలోల గంజాయి పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

ఘట్ కేసర్, వెలుగు : బైక్ పై గంజాయి తెస్తున్న వ్యక్తిని ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.   సీఐ జూపల్లి రవి తెలిపిన ప్రకారం.. మంగళవారం సాయంత్రం రాంపల్లి- చెంగిచెర్ల రోడ్డులో ఎక్సైజ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సింహులుపేట మండలం దుబ్బతండాకు చెందిన జాటోతు రమేశ్​మేడ్చల్ కీసర మండలం, రాంపల్లి, డీఎస్ఆర్ రాజ్ ఎన్ క్లేవ్ ఉంటున్నాడు.

అతడు అనుమానాస్పదస్థితి లో  బైక్ పై వస్తుండగా  ఆపి చెక్ చేశారు. అతని వద్ద 3 .345 కిలోల గంజాయి దొరికింది. తక్కువ ధరకు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి తీసుకొచ్చి రాంపల్లి, ఈసీఐఎల్ ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. గంజాయితో పాటు బైక్, మొబై ల్ ఫోన్ ను  స్వాధీనం చేసుకుని రమేశ్​ను రిమాండ్ కు తరలించినట్టు ఎక్సైజ్ సీఐ తెలిపారు.