ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల్లో సర్వే నెంబర్ 867లో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చేశారు. సీలింగ్ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగి రేకుల షెడ్లను తొలగించింది.
రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన రెండు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ కాపీలు ఉన్నాయని, వీటికి ఇంటి నంబర్ తీసుకుని సకాలంలో పన్ను కూడా చెల్లిస్తున్నామని బాధితుడు ముగ్ధం ఈశ్వర్ ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరికాదన్నారు. 26 ఎకరాల్లో ఉన్న వెంచర్ లో తన ఒక్కనిదే సీలింగ్ లో ఉందా అధికారులను ప్రశ్నించారు.
