కృష్ణ మరణంపై సితార, మంజుల ఎమోషనల్ పోస్ట్

కృష్ణ మరణంపై సితార, మంజుల ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ మరణం ఘట్టమనేని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. తన తాతయ్య మరణం పట్ల మహేష్ బాబు కుమార్తె సితార ఎమోషనల్ పోస్టు పెట్టారు. కృష్ణతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. తాతయ్యతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఇకపై అన్నీ ఇంతకు ముందులా ఉండవు అంటూ సితార భావోద్వేగానికి గురయ్యారు. "ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నా" అని రాశారు.  

కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల కూడా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. " నాన్న నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్ కాదు మా జీవితానికి కూడా సూపర్ స్టార్‌. మీరు బయట ఎలా ఉన్నపటికీ ఇంటిలో మా కోసం ఒక సాధారణ తండ్రిలా ప్రేమానురాగాలు పంచడం ఎంతో గర్వకారణం. మీరు ఉన్నా లేకపోయినా మీ ప్రేమ మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక వెండితెరపై మీ జ్ఞాపకాలు ఎప్పటికి చెరిగిపోనివి.నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్న. లవ్ యు ఎప్పటికీ" అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు.