హ్యాపీ బర్త్ డే మై స్టార్.. సితారకు స్పెషల్ విషెస్

హ్యాపీ బర్త్ డే మై స్టార్.. సితారకు స్పెషల్ విషెస్

ఇప్పుడిప్పుడే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెడుతోన్న ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని నేటితో (జూలై 20) 11వ వసంతంలోకి అడగుపెట్టింది. ఈ సందర్భంగా తండ్రి మహేష్ బాబు, తల్లి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే మై స్టార్.. జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించాలని చెబుతూ సితార బ్యూటీఫుల్ పిక్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు. నమ్రత కూడా ఇన్ స్టాగ్రామ్ లో తన కూతురికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది.

Happy 11th, my star!! ? Achieve everything you set your mind to ❤️❤️❤️ #SitaraGhattamaneni pic.twitter.com/ZFPdizISia

— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2023

దాంతో తన కూతురు సితార పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ వీడియోను కూడా ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా సైకిళ్లు తీసుకున్న విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండా మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ను  ఫిబ్రవరి10, 2005న వివాహం చేసుకున్నారు. ఆ తరువాత, 31 ఆగష్టు 2006 న వారికి కుమారుడు గౌతమ్ జన్మించగా.. జూలై 20, 2012 న కుమార్తె సితార జన్మించింది.