అయోధ్య రామ మందిరం పూజారిగా గజియాబాద్ విద్యార్థి

అయోధ్య రామ మందిరం పూజారిగా గజియాబాద్ విద్యార్థి

అయోధ్య రామమందిరం నిర్మాణం దాదాపు పూర్తికావస్తోంది. 2024 జనవరిలో అయోధ్య రామమందిరాన్ని పునప్రారంభించేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహ కులు. ఈ క్రమంలో రామమందిరంలో పూజారిగా ఓ యువ అర్చకుడిని ఎంపిక చేశారు. 

అయోధ్య రామమందిరం పూజారిగా ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన అర్చక విద్యార్థి మోహిత్ పాండేను ఎంపికయ్యారు. దుధేశ్వర వేద విద్యాపీఠ్ లో ఏడేళ్లు ఉండి శిక్షణ తీసుకున్న మోహిత్.. తదుపరి చదువుల కోసం తిరుపతిలో పూర్తి చేశారు.  

అతి చిన్నవయసులో మోహిత్ పాండే ప్రతిష్టాక మైన అయోధ్య రామమందిరానికి పూజారిగా నియమించబడ్డారు. అయోధ్య రామమందిరంలో పూజారి పోస్ట్ కు 3వేల మందిని ఇంటర్వ్యూ చేయగా.. అందులో ఈ స్థానానికి ఎంపికైన 50 మందిలో మోహిత్ పాండే ఎంపికయ్యారు. నియామకానికి ముందు ఆరు నెలల పాటు మోహిత్ కు శిక్షణ ఇస్తారు.