Viral Video: వీళ్లకెంత ధైర్యం .. కారు కిటికీలో నుంచి తుపాకీ ఊపుతున్న వీడియో

Viral Video:  వీళ్లకెంత ధైర్యం .. కారు కిటికీలో నుంచి తుపాకీ  ఊపుతున్న వీడియో

ఘజియాబాద్ లో  కారులోనుంచి పిస్టల్ ఊపుతున్న ఘటన  కలకలం రేగింది.  ఓ వ్యక్తి కారు వెనుక సీట్లో కూర్చొని కిటికీలోనుంచి తుపాకీ ఊపుతున్న వీడియో  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ఓ కారును వెంబడించి డ్రైవర్ ను కాల్చి చంపాడు.  ఈ సంఘటన ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్ ప్రాంతంలోని జాతీయ రహదారి 24 సమీపంలో నవంబర్ 17న  జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ వీడియో  వైరల్ కావడంతో ప్రజలు  పోలీసులను ప్రశ్నిస్తున్నారు.   దుండగులు  కారు వైట్ కలర్ టాటా పంచ్ కారులో ప్రయాణిస్తూ...   కారు ఎడమవైపు వెనుక కిటికీలోంచి తుపాకీ బయటపెట్టి ఊపుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డుండగులు ప్రయాణించిన కారును గుర్తించిన పోలీసులు స్వాధీనం నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని  విజయనగర్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించినట్లు ఘజియాబాద్ డీసీపీ తెలిపారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో  కారులో నలుగురు యువకులు ఉన్నారని కొత్వాలినగర్  ACP  తెలిపారు.  విజయ్ నగర్ ప్రాంతంలో ఈఘటన జరిగినట్లు నిర్దారణకు వచ్చామని తెలిపారు. నిందితులపై  CRPC & ఆయుధాల చట్టం ప్రకారం  కేసు నమోదు చేశామన్నారు.  వాహనాన్ని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.