జీహెచ్ఎంసీ లో బీసీలకు 122 సీట్లు..40 శాతం స్థానాలు వారికే...

జీహెచ్ఎంసీ లో బీసీలకు 122 సీట్లు..40 శాతం స్థానాలు వారికే...
  • ఎస్సీలకు 23, ఎస్టీలకు 5 స్థానాలు 
  • జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఖరారు 

హైదరాబాద్​సిటీ, వెలుగు :  రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్​ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందులో భాగంగా 2011 జనాభా లెక్కలు, బీసీ డెడికేషన్​కమిషన్​రిపోర్ట్​ ఆధారంగా జీహెచ్ఎంసీలోని 300 వార్డులకు బీసీ, మహిళ, ఎస్సీ, ఎస్టీ, జనరల్​స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను ఫైనల్​చేసింది. మొత్తం వార్డుల్లో బీసీలకు ఏకంగా 122 స్థానాలను కేటాయించింది. 

ఇందులో పురుషులకు 61, మహిళలకు 61 సీట్లను సరిసమానంగా కేటాయించారు. అంటే మొత్తం స్థానాల్లో 40 శాతానికి పైగా సీట్లు బీసీలకే దక్కాయి. తర్వాత 76 స్థానాలను మహిళలకు (జనరల్) ఇచ్చారు. ఎస్సీలకు 23 స్థానాలు కేటాయించగా ఇందులో పురుషులకు 12, మహిళలకు 11 స్థానాలు ఉన్నాయి. ఎస్టీలకు ఐదు స్థానాలు కేటాయించగా, మగవారికి మూడు , స్త్రీలకు రెండు, అన్​రిజర్వుడ్​గా 74 స్థానాలను ప్రకటించారు.  కాగా, అన్ని కేటగిరీల్లో కలిపి మహిళలకు 150 స్థానాలు దక్కడం విశేషం.

మొత్తం 300 వార్డుల్లో రిజర్వేషన్లు ఇలా.. 

సామాజిక వర్గం       కేటాయించిన వార్డులు      శాతం
బీసీ                                            122                        40.66%
ఎస్సీ                                            23                        7.66%
ఎస్టీ                                              05                        1,66%
మహిళ (జనరల్)                        76                         25.33
అన్ రిజర్వ్డ్ (జనరల్)               74                            74%