బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేస్తున్నారా..? ఇంటికి రెడ్ మార్క్

బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేస్తున్నారా..? ఇంటికి రెడ్ మార్క్

అంబర్​పేట, వెలుగు: జీహెచ్ఎంసీ అంబర్​పేట సర్కిల్​లో- అసెస్టింట్ మెడికల్ ఆఫీసర్ హేమలత ఆధ్వర్యంలో ఎన్ఎఫ్ఏలు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు శుక్రవారం ఆయా బస్తీలు, కాలనీల్లో పర్యటించారు. బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేసే ఇండ్లను గుర్తించారు. 

ఇంటింటికి వెళ్లి చెత్తను స్వచ్ఛ ఆటోల్లో వేస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. స్వచ్ఛ ఆటోకు చెత్త  ఇచ్చే వారి ఇండ్లకు గ్రీన్, ఇవ్వని వారి ఇండ్లకు రెడ్ కలర్ తో మార్కింగ్ చేశారు. ఈ మార్కింగ్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపై చెత్త వేసే వారి వివరాలను తెలుసుకుంటున్నట్లు హేమలత తెలిపారు. ఇందుకు గల కారణాల కనుక్కొని పరిష్కరించనున్నట్లు చెప్పారు.