హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన ఈ నెల 31న జరగనుంది. ఫిబ్రవరి10తో ప్రస్తుత కౌన్సిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం కానున్నది. ఇందులో 2026–-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన రూ.11,460 కోట్ల బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలపన్నారు.
దీంతో కౌన్సిల్ ఆరోసారి బడ్జెట్ కి ఆమోదం తెలిపినట్టవుతుంది. వాస్తవానికి ఐదేండ్ల పాటు ఉండే కాలపరిమితిలో ఐదు సార్లు మాత్రమే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఈ కౌన్సిల్ కి పలు కారణాల వల్ల ఆరోసారి కూడా అవకాశం వచ్చింది.
రేపు స్టాండింగ్ కమిటీ మీటింగ్
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం గురువారం జరుగనున్నది. ఇందులో కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదించే అవకాశముంది. సీఆర్ఎంపీ ఫేజ్– 2 కింద రూ.3,145 కోట్లతో1,045 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణ బాధ్యతలను ఏజేన్సీలకు అప్పగించే అంశంపై చర్చించి ఆమోదించే ఛాన్స్ఉంది. వీటితో పాటు మరిన్ని అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు.
