బల్దియా బడ్జెట్​  రూ .6,150 కోట్లు!

బల్దియా బడ్జెట్​  రూ .6,150 కోట్లు!
  • రేపు ఆమోదానికి స్టాండింగ్ ​క మిటీ ముందుకు..
  • ఆ తర్వాత కౌన్సిల్​ మీటింగ్​లో తీర్మానం 
  • అనంతరం ప్రభుత్వానికి నివేదిక 

హైదరాబాద్, వెలుగు: బల్దియా కొత్త బడ్జెట్​సిద్ధమైంది. 2022 –- 23 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.6,150 కోట్లతో రూపొందించినట్టు తెలిసింది. దీని ఆమోదానికి బుధవారం స్టాండింగ్​ కమిటీ  ముందుకు రానుంది. బడ్జెట్ లో  రెవెన్యూ ఆదాయం రూ.3,434 కోట్లు, రెవెన్యూ ఖర్చు రూ.2,800 కోట్లతో తయారైనట్టు, ఇందులో రూ.634 కోట్లు మిగులు, మూలధన ఆదాయం రూ.3,350 కోట్లు , ఖర్చులు రూ.3,350 కోట్లుగా చూపించినట్టు తెలిసింది.  2021–-22 ఆర్థిక ఏడాదికి సంబంధించి కూడా సవరణ బడ్జెట్ ప్రతిపాదిస్తారు. గతేడాది రూ.5,600 కోట్లకు ఆమోదం పొందగా, దానిని రూ.6,300 కోట్లకు సవరించారు. ఇది కూడా స్టాండింగ్ కమిటీ ముందుకు రానుంది. ఆమోదం పొందిన తర్వాత సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెడతారు. అక్కడ   ఆమోదించి  ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తారు.