Ram Charan: టికెట్ ధరల పెంపునకు సీఎంలకు థ్యాంక్స్.. పవన్‌కు స్పెషల్ రిప్లై ఇచ్చిన చరణ్

Ram Charan: టికెట్ ధరల పెంపునకు సీఎంలకు థ్యాంక్స్.. పవన్‌కు స్పెషల్ రిప్లై ఇచ్చిన చరణ్

‘పెద్ది’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండగా, సినిమా విడుదలపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా ప్రత్యేక షోలు, అదనపు ప్రదర్శనలు, అలాగే టికెట్ ధరల పెంపుకు పర్మిషన్ ఇచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, గౌరవ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ లకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినిమాపై ప్రభుత్వం చూపిస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘పెద్ది’ దూసుకుపోతుండగా, ప్రత్యేక షోలు, పెరిగిన టికెట్ ధరలు, భారీ అంచనాల నేపథ్యంలో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘పెద్ది’కి పవన్ ఆశీస్సులు..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గా ‘పెద్ది’ టీమ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తరఫున ట్వీట్ చేస్తూ రామ్ చరణ్‌కు, చిత్ర బృందానికి భారీ సక్సెస్ రావాలని ఆకాంక్షించారు.

ALSO READ : బాక్సాఫీస్ క్లాష్: థియేటర్లలో రామ్ చరణ్ 'పెద్ది' వేట..

“రామ్ చరణ్ అనే పేరు స్వయంగా ఆంజనేయ స్వామితో అనుబంధం కలిగిన పవిత్ర నామం. అది భక్తి, శక్తి, శ్రీరాముని పాదాల చెంత సంపూర్ణ శరణాగతికి ప్రతీక. ఆంజనేయ స్వామి ‘పెద్ది’ సినిమా ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగించి, ఈ చిత్ర బృందాన్ని విజయాలు, కీర్తి ప్రతిష్ఠలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఈ చిత్రానికి దక్కాలని ప్రార్థిస్తున్నాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలకు స్పందించిన రామ్ చరణ్, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మీ మాటలు నాకు మాత్రమే కాకుండా ‘పెద్ది’ చిత్ర బృందం మొత్తానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఎల్లప్పుడూ మాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు అని తెలిపారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘పెద్ది’ దూసుకుపోతుండగా, ప్రత్యేక షోలు, పెరిగిన టికెట్ ధరలు, భారీ అంచనాల నేపథ్యంలో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.