క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్.. ఇండియాలో ఇండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్తాన్ !

క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్.. ఇండియాలో ఇండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్తాన్ !

ఇది కాస్త ఇంట్రెస్టింగ్ అప్డేటే.. క్రికెట్ హిస్టరీలో ఎప్పుడూ జరగనిది ఈ సారి జరుగుతోంది. ఇండియాలో ఇండియాకు ఆతిథ్యం ఇవ్వనుంది ఆఫ్ఘనిస్తాన్. ఇదేంటి.. ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలనుకుంటే వాళ్ల కంట్రీలో కదా.. మరి మన దేశంలో మనకు ఆతిథ్యం ఇవ్వడమేంటనే కదా మీ డౌట్. అయితే చదవండి. 

ఫస్ట్ టైమ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాతో క్రికెట్ సిరీస్ కు ఆతిథ్యమిస్తోంది. ఆఫ్ఘాన్ హోమ్ గ్రౌండ్ వాళ్ల దేశంలో కాదు. ఢిల్లీలో. మూడు టీ20 లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. సెప్టెంబర్ నెలలో ఈ సిరీస్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇండియా టీమ్ షెడ్యూల్ ను ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 13, 16, 19 తేదీల్లో మ్యాచులు ఉంటాయని భావిస్తున్నారు. అంతకు ముందు జూన్ 6 నుంచి ఒక టెస్టు, మూడు వండేలు ఆడనున్నారు. 

►ALSO READ | బుడ్డోడి బుర్రే బుర్ర.. IPLలో సిక్సులు మీద సిక్సులు కొట్టింది ఇందుకా.. ఓ పద్ధతి.. ఓ ప్లానింగ్.. ఓ విజన్ !

ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పదేళ్లుగా  ఆఫ్ఘనిస్తాన్ తమ మ్యాచ్‌లను భారత్,  యూఏఈలలో ఆడుతోంది. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు గ్రేటర్ నోయిడాలో , ఆ తర్వాత 2018లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20ఐ సిరీస్‌కు డెహ్రాడూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత యూఏఈకి మార్చుకున్నారు. 

సెప్టెంబర్ 2024లో గ్రేటర్ నోయిడాలో పూర్తిస్థాయి న్యూజిలాండ్ జట్టుతో ఒక టెస్ట్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు. టెస్ట్‌కు రెండు రోజుల ముందు కురిసిన వర్షం కారణంగా అవుట్‌ఫీల్డ్ సరిగా లేకపోవడంతో, ఒక్క బంతి కూడా వేయకుండానే ఆ మ్యాచ్ రద్దయింది.