సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సి-డాక్) దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇతర పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 1న ప్రారంభమై జూన్ 20న ముగుస్తుంది.
మొత్తం పోస్టులు: 651. హైదరాబాద్ పరిధిలో 76 పోస్టులు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనవర్సిటీ/ బోర్డు నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బి.టెక్/ బీఈ, ఎంఎస్సీ, ఎంఎస్ఈ/ఎం.టెక్, ఎం.ఫిల్/ పీహెచ్డీ, సీఏ, సీఎంఏ, సీఎస్, ఎల్ఎల్‌బీ పూర్తిచేసి ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం అవసరం.
గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 1.
లాస్ట్ డేట్: జూన్ 20.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ recruit-hyd@cdac.inను సందర్శించండి.
