హైదరాబాద్ సిటీ, వెలుగు : ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం(పీటీపీ) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ ఆఫీసుల్లో పీటీపీ ఉంటుందన్నారు.
బిల్ కలెక్టర్ల ద్వారా , ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్‌లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు సెల్ఫ్అసెస్ మెంట్, ఆస్తి పన్ను చెల్లింపుల్లో ఇతర సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 22, మార్చి1, 8, 15, 22, 29 తేదీల్లో డీసీ ఆఫీసుల్లో పీటీపీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
