
- జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో బీజేపీ కార్పొరేటర్ల నిరసన
హైదరాబాద్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బల్దియాను లూటీ చేస్తున్నాయని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో శనివారం వారు నిరసన చేపట్టారు. బడ్జెట్‌కు సంబంధించిన స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని తెలుసుకొని, తొలుత వారు అక్కడి చేరుకున్నారు. కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తున్న అధికారులను అడ్డుకున్నారు. అనంతరం కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబరితికి వినతిపత్రం అందజేశారు.