
అంబర్పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ పాత బ్రిడ్జి ప్రస్థానం ఇక ముగిసింది. ఇక్కడ ఇప్పటికే ఓవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా, పాత బ్రిడ్జి ఇటీవల వచ్చిన భారీ వరదలకు కోతకు గురైంది. దీంతో పటిష్టను పరిశీలించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు వాహనాల రాకపోకలకు బ్రిడ్జి సురక్షితం కాదని తేల్చారు. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జిని కూల్చి వేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
నూతన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే పాత బ్రిడ్జిని కూల్చి వేస్తున్నారు అధికారులు . అంబర్ పేట నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్లేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయంగా గోల్నాక బ్రిడ్జిపై నుంచి వెళ్లవలెను.
►ALSO READ | జంట జలాశయాలకు జలకళ.. రెండు గేట్లు ఓపెన్
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త బ్రిడ్జి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఇప్పటికే కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చిలోపు కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని, అప్పటివరకు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. మొన్నటి వరదలతో ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పనులు పూర్తయితే వరదలు వచ్చిన సమయంలో వాహనదారులకు ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్తున్నారు.