జంట జలాశయాలకు జలకళ.. రెండు గేట్లు ఓపెన్

జంట జలాశయాలకు  జలకళ.. రెండు గేట్లు ఓపెన్

హైదరాబాద్ సిటీ జంట జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు మరోసారి నిండాయి. వికారాబాద్, తాండూర్, మోమిన్​పేట, మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా ఇన్ ఫ్లో వస్తున్నది. వరద ఉధృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు మూసీలోకి నీటిని వదులుతున్నారు.

ఉస్మాన్​సాగర్​, హిమాయత్​ సాగర్​ జలాశయాలకు సంబంధించి అక్టోబర్ 22న రెండు గేట్లను పైకి ఎత్తారు జలమండలి అధికారులు. జలాశయాల గేట్లను ఎత్తి నీటిని మూసిలోకి వదిలిపెడుతున్నారు. 

►ALSO READ | నవంబర్ లో స్థానిక ఎన్నికలు.. ?.. రేపటి (అక్టోబర్ 23)కేబినెట్ లో కీలక నిర్ణయం!

హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 1365 క్యూసెక్కుల నీటిని,  ఉస్మాన్ సాగర్ నుంచి రెండు గేట్లు ఎత్తి 460 క్యూసెక్కుల నీటిని మూసిలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.35, ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,789.8 అడుగులు ఉన్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.