డ్రైనేజీ నీటిని చెరువులోకి వదలొద్దు

డ్రైనేజీ నీటిని చెరువులోకి వదలొద్దు

GHMC నుంచి వస్తున్న డ్రైనేజీ నీటిని తమ ఊరు చెరువులోకి వదలొద్దంటూ రంగారెడ్డి జిల్లా పసుమాముల గ్రామస్థులు పార్టీలకతీతంగా ఏకగ్రీవ తీర్మాణం చేశారు. దాదాపు ఏడేళ్లుగా ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, BNరెడ్డి నగర్, హస్తినాపురంతో పాటు చంపాపేట్ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున డ్రైనేజ్ నీరు వచ్చి 110 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో కలుస్తున్నాయన్నారు. దీంతో డెంగ్యూ, మలేరియా రోగాలు వస్తున్నాయన్నారు. చెరువుపై ఆధారపడిన మత్సకారులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.