
హైదరాబాద్: మరో అవినీతి చేప ACBకి చిక్కింది. హయాత్ నగర్ సర్కిల్ ఆఫీసు పరిధిలోని చైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ అనే ఉద్యోగి లంచం తీసుకుంటూ ACBకి దొరికాడు. ఇంటి నిర్మాణం కోసం శ్రీనివాస్ అనే యజమాని నుంచి శ్రీధర్ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. మూడు వేలు ఇవ్వడానికి ఒప్పుకోవడంతో ఇంటి యజమాని రూ.3వేలు లంచం ఇచ్చాడు.
తర్వాత మళ్లీ లంచం కోసం వేధించడంతో బాధితుడు ACB అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సోమవారం GJMC ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా శ్రీధర్ ను, అతడి అసిస్టెంట్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ACB అధికారులు.