జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్ రోడ్‌నంబర్2లో శుక్రవారం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలంపై జీహెచ్ఎంసీ ఉద్యోగులు దాడి చేశారు. రాంగ్ రూట్‌లో వస్తున్న కారును శ్రీశైలం ఆపారు.
ఆ వాహనంలో ఉన్న జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్‌కు చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ అమిత్, అసిస్టెంట్ ఇంజినీర్ ఆనంద్‌తోపాటు మరో ఉద్యోగి ఆయనతో వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడటమే కాకుండా, కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు.
బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం, దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
