- జోన్కు ఐదు చొప్పున 30 పార్కుల్లో కంపోస్టులు పిట్లు
- ఆ తర్వాత గ్రేటర్ పరిధిలోని 1,032 పార్కుల్లో ఏర్పాటుకు కరసత్తు
- చెట్లకు కెమికల్ ట్రీట్మెంట్ చేయనున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: పచ్చదనంపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. గ్రేటర్పార్కుల్లోని చెట్లను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పార్కుల్లో కంపోస్ట్ పిట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్చేస్తోంది. ఒక్కో పార్కులో రెండు చొప్పున పిట్లు ఏర్పాటు చేసి, ఒక్కో దాంట్లో 45 రోజుల పాటు చెత్తను ఉంచనుంది. తర్వాత ఉత్పత్తి అయిన ఎరువును అధికారులు అక్కడి చెట్లకు వేయనున్నారు. ముందుగా ఒక్కో జోన్ లోని 5 పార్కులను ఎంపిక చేసి, మొత్తం 30 పార్కుల్లో ప్రయోగాత్మకంగా కంపోస్టు ఎరువును తయారుచేయనున్నారు. వీటిలో వచ్చే ఫలితాలను బట్టి, గ్రేటర్ లోని 1,032 పార్కుల్లో కంపోస్టు పిట్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో చెట్లకు బలమైన ఎరువును అందించేందుకు ఈ కంపోస్టు పిట్లు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఇంజక్షన్బోర్లు
ఇప్పటికే బల్దియా అధికారులు కొన్ని పార్కుల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, అందులో ఇంజక్షన్ బోర్లు వేయించారు. దాదాపు 100 అడుగులతో 5 మేజర్ పార్కుల్లో ఇంకుడు గుంతలను తవ్వించారు. వీటితో పార్కులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది. కొన్ని నెలల తర్వాత ఇంజక్షన్బోర్ల ఇంకుడుగుంతల రిజల్ట్ తెలియనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో తిరిగి ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆశించిన ఫలితాలు వస్తే సిటీలోని అన్ని పార్కుల్లో ఇంజక్షన్బోర్లతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయనున్నారు.
ఏండ్ల నాటి చెట్లపై ఫోకస్
గ్రేటర్ లో 50 నుంచి 60 ఏండ్లు, అంతకు మించిన వయస్సు ఉన్న చెట్లను కాపాడేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. డ్రైడ్, డీసీజ్, డెడ్ అయిన చెట్లపై బల్దియాలోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. 50 ఏండ్లకు మించి వయస్సున్న చెట్లు సిటీలో 450 ఉన్నట్లు గుర్తించారు. వీటిలోని 300 చెట్లు ఇండ్ల ఆవరణలో ఉండగా, మిగతా 150 చెట్లు పబ్లిక్ ప్లేస్ లలో ఉన్నాయి. ఇండ్ల ఆవరణలోని చెట్లను సంరక్షించాలని ఓనర్లకు సూచిస్తున్నారు. వర్షా కాలం తర్వాత మిగిలిన చెట్ల నుంచి చిగురు రాకపోతే తొలగినుచున్నారు. డిసీజ్ఉన్న చెట్లకు కెమికల్ ట్రీట్ మెంట్ ఇచ్చి తిరిగి పెరిగేలా చేయనున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన బతకని చెట్లను కమిషనర్ అప్రూవల్ తీసుకొని తొలగించనున్నారు.
