GHMC హై అలర్ట్.. 13 రెస్క్యూ టీమ్ లు రంగంలోకి

GHMC హై అలర్ట్.. 13 రెస్క్యూ టీమ్ లు రంగంలోకి

హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో సిటీ మొత్తం వరదనీటితో నిండిపోయింది. వెంటనే అప్రమత్తమైన జీహెచ్ఎమ్ సీ 13 డిజాస్టర్  రెస్క్యూ టీమ్ లను రంగంలోకి దించింది. అత్యవసర పరిస్థితుల్లో 04021111111, డయల్ 100, మై జీహెచ్‌ఎంసీ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. తక్షణ కర్తవ్యంగా సిటీలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసింది. ఐటీ కారిడార్ లోని ఉద్యోగులను పని వేళలు ముగిసిన రెండు గంటల తర్వాత ఇంటికెళ్లాలని సూచించింది. ఇంటికెళ్లే సమయంలో గూగుల్ మ్యాప్ ని ఫాలో కావాలని తెలిపింది.

వర్షం పడుతున్నప్పుడు  పాదచారులు ఎవరైనా చెట్లకు, విద్యుత్ స్థంబాలకు, ట్రాన్స్‌ఫార్మర్‌లకు దూరంగా ఉండాలని తెలిపింది. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్‌కుమార్‌లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ద్విచక్ర వాహానదారులు రోడ్లపై మ్యాన్ హోల్స్ ను గుర్తించి డ్రైవింగ్ చేయాలని తెలిపింది.