
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన సొంత డివిజన్ బంజారాహిల్స్ పై ఫోకస్ పెట్టారు. శనివారం తన చాంబర్లో ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బంజారాహిల్స్ డివిజన్ ను రోల్ మోడల్ గా మార్చాలని, పెండిండ్ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ హాల్స్, స్పోర్ట్సు కాంప్లెక్స్, మహిళా భవన్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయని, త్వరగా పూర్తిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పనుల్లో పురోగతి లేకపోతే సహంచేది లేదని వార్నింగ్ ఇచ్చారు.