
హైదరాబాద్ లో 31 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ అధికారులు రద్దు చేశారు. 27 వేల బర్త్ సర్టిఫికెట్ల్స్, నాలుగు వేల డెత్ సర్టిఫికెట్స్ ను రద్దు చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా సర్టిఫికెట్లను జారీ చేసిన మీ సేవ సెంటర్లపై లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సౌత్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ లోని మీ సేవ సెంటర్లో అధికారులు తనిఖీలు చేశారు. మెహదీపట్నం ,చార్మినార్, బేగంపేట్, సికింద్రాబాద్ సర్కిల్ లో జారీ చేసిన 31 వేల సర్టిఫికెట్లను అధికారులు రద్దు చేశారు.