హైదరాబాద్ వీధి కుక్కల కోసం శేరిలింగంపల్లిలో పెద్ద షెల్టర్

హైదరాబాద్ వీధి కుక్కల కోసం శేరిలింగంపల్లిలో పెద్ద షెల్టర్

హైదరాబాద్ లో వీధి కుక్కల బెడద రోజరోజుకి తీవ్రమవుతోన్న సంగతి తెలిసిందే. ఒంటరిగా బయటకు రావాలంటే  బయపడాల్సిన పరిస్థితి  ఏర్పడింది. ఈ క్రమంలో జనవరి 8న జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో  మేయర్ గద్వాల విజయలక్ష్మీ,  అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీశ్, వెటర్నరీ అధికారులు, హై లెవెల్ కమిటీ సభ్యులైన కార్పొరేటర్లతో సమీక్షించారు. సిటీలో వీధి కుక్కల బెడద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు. ఈ మేరకు శేరిలింగంపల్లిలో ఎకరం విస్తీర్ణంలో వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్​ను ఏర్పాటు చేస్తామన్నారు.

వీధి కుక్కల బెడద నుంచి జనాలను రక్షించడానికి హై లెవెల్ కమిటీ సూచన మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు విజయలక్ష్మి. కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటి బర్త్ కంట్రోల్ (ఏబీసీ) చర్యలు తీసుకుంటామన్నారు. వీధి కుక్కలకు రెగ్యులర్​గా రేబిస్ వ్యాక్సిన్ అందించేందుకు వెటర్నరీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. . ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని హై లెవెల్ కమిటీ సభ్యులు సూచించారు.

జోన్ల వారీగా సమీక్షించాలని, కుక్కలకు మంచినీరు, సమయానికి ఫీడింగ్ అందించాలన్నారు. మటన్, చికెన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను ఖాళీ స్థలంలో పారవేయకుండా డస్ట్ బిన్​లో వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు వెటర్నరీ అడిషనల్ కమిషనర్ చీఫ్ ఎప్పటి కప్పుడు క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు.