తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరు కనిపించకుండా.. స్టిక్కర్ ఎందుకు అంటించారంటే..

తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరు కనిపించకుండా.. స్టిక్కర్ ఎందుకు అంటించారంటే..

హైదరాబాద్: తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరులో ఎలాంటి మార్పు లేదని GHMC ప్రాజెక్ట్స్ వింగ్ తెలిపింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే ఈ ఫ్లైఓవర్కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా నామకరణం చేస్తూ ఆమోదం తెలిపింది. ప్లై ఓవర్కు ఒకవైపు బోర్డ్ ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయి. రెండోవైపు బోర్డు ఏర్పాటుకు ఫౌండేషన్ క్యూరింగ్ జరుగుతుంది. క్యూరింగ్ పీరియడ్ పూర్తి కాగానే రెండు రోజుల్లో రెండో సైడ్  బోర్డు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. అప్పటి వరకూ ఇప్పటికే ఏర్పాటు చేసిన బోర్డును అందుకే కప్పి ఉంచామని GHMC ప్రాజెక్ట్స్ వింగ్ స్పష్టతనిచ్చింది. రెండింటిని కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని  జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ వింగ్ ప్రకటనలో స్పష్టం చేసింది.

తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మార్చాక బోర్డుపై పేరు కనిపించకుండా స్టిక్కర్ వేయడంతో గందరగోళం నెలకొంది. అందుకే ఈ విషయంలో స్పష్టత ఇస్తూ జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ వింగ్ క్లారిటీ ఇచ్చింది. రెండో వైపు బోర్డు పనులు కూడా పూర్తయ్యాక.. రెండు బోర్డులను కలిపి ఒకేసారి ప్రారంభించే ఉద్దేశంతోనే కొత్త బోర్డుపై స్టిక్కర్ వేసినట్లు తెలిపింది. 2005 జనవరి 22న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. అప్పట్లో ‘తెలుగు తల్లి ఫ్లై ఓవర్’ అని ఈ ఫ్లైఓవర్కు పేరు పెట్టారు. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత స్వరాష్ట్రంలో ‘తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్’గా రేవంత్ సర్కార్ ఈ ఫ్లైఓవర్ పేరు మార్చడం గమనార్హం.