హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఫుట్ పాత్ ల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొసాగుతోంది. శనివారం ఒక్కరోజే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో ప్రతి జోన్‌లో ఒక ప్రధాన రహదారిని ఎంపిక చేసి, అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. శంషాబాద్ సర్కిల్‌లో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ నుంచి మిషన్ కాంపౌండ్(ఫిరంగి నాలా) వరకు, మూసారాంబాగ్‌లో ఎస్‌బీఐ నుంచి రిలయన్స్ ట్రెండ్స్ వరకు, గోల్కొండలో ఫతే దర్వాజా మార్గంగా లంగర్ హౌస్ కూడలి వరకు, ఖైరతాబాద్‌లో బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి టాండోస్ రెస్టారెంట్ వరకు, అంబర్‌పేటలో వీర్ సావర్కర్ విగ్రహం నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్, బర్కత్‌పుర వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 283 ఆక్రమణలను తొలగించారు.
వీటిలో 79 శాశ్వత, 204 తాత్కాలిక నిర్మాణాలు ఉన్నాయి. అలాగే, గత ఏప్రిల్ 4 నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 2,620 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
