జీహెచ్ఎంసీపై కాసుల వర్షం.. రూ. 1915 కోట్ల ట్యాక్స్​ వసూలు

జీహెచ్ఎంసీపై కాసుల వర్షం.. రూ. 1915 కోట్ల ట్యాక్స్​ వసూలు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీపై కాసుల వర్షం కురిసింది. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ భారీగా పెరిగింది. 2022-–23లో రూ.1660.38కోట్లు వసూలవగా, 2023–24లో రూ.1914.87 కోట్లు వచ్చింది. ఇందులో ఒక్క మార్చి నెలలోనే రూ.500కోట్లకి పైగా వసూలైంది. ఓటీఎస్​ద్వారా మార్చి నెలలో రూ.320 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.