బెల్లంపల్లి పట్టణంలోని చెక్ బౌన్స్కేసులో జైలు శిక్ష

బెల్లంపల్లి పట్టణంలోని చెక్ బౌన్స్కేసులో జైలు శిక్ష
  •     రూ.15లక్షల జరిమానా

బెల్లంపల్లి, వెలుగు: చెక్​బౌన్స్​కేసులో బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తికి ఏడాది జైలు శిక్షతోపాటురూ.15 లక్షల జరిమానా విధిస్తు జూనియర్​సివిల్ జడ్జి జె.ముకేశ్ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్​హెచ్​వో శ్రీనివాస్​రావు తెలిపారు. 2021లో కాల్​టెక్స్​కు చెందిన బంక కుమార్​కు విజ్ఞాన్ రూ.12 లక్షల చెక్​ఇవ్వగా అది బౌన్స్​అయ్యింది. దీంతో ఆయన పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన జడ్జి నేరం రుజువు కావడంతో విజ్ఞాన్ కు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చినట్లు తెలిపారు.