ఏం తినాలి, ఎలా తినాలి ? : రఘుప్రసాద్

ఏం తినాలి, ఎలా తినాలి ? : రఘుప్రసాద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు  ఏం తినాలి?  ఎలా తినాలి ? అన్న విషయంపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే స్టేట్ ఫుడ్ సేఫ్టీ వింగ్ తో కలిసి ఈట్ రైట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. చాలా ప్రాంతాల్లోని విద్యార్థులు తమ స్కూల్ కు సమీపంలో విక్రయించే క్వాలిటీ లేని ఫుడ్​తిని అస్వస్థతకు గురవుతుంటారు. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పిస్తే బాగుంటుందని ఈట్ రైట్​ప్రోగ్రామ్​నిర్వహిస్తున్నారు.

జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్  రఘుప్రసాద్ శుక్రవారం స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని   స్కూల్స్​అన్నీ జీహెచ్ఎంసీ లో నమోదు చేసుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ త్వరలోనే సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే స్టేట్ ఫుడ్ సేఫ్టీ వింగ్ సిటీలోని 261 స్కూళ్ల వివరాలను తీసుకుందని ఈ కార్యక్రమాన్ని పక్కాగా  నిర్వహించేందుకు జీహెచ్ఎంసీని భాగస్వామిని చేయాలని ఫుడ్ సేఫ్టీ వింగ్ భావిస్తున్నట్లు సమాచారం.