మూడు ఫ్లోర్లకు పర్మిషన్..ఆరు ఫ్లోర్లు నిర్మాణం

మూడు ఫ్లోర్లకు పర్మిషన్..ఆరు ఫ్లోర్లు నిర్మాణం
  • కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు 

మెహిదీపట్నం, వెలుగు : మెహిదీపట్నం అయోధ్య నగర్​లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్​ప్లానింగ్ అధికారులు బుధవారం కూల్చివేశారు. మూడు అంతస్తులకు పర్మిషన్​తీసుకుని, ఆరు అంతస్తులు నిర్మించారని సర్కిల్-12 టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమూర్తి తెలిపారు. 

నాలుగు, ఐదు, ఆరు అంతస్తులను కూల్చివేసినట్లు వెల్లడించారు. భోజగుట్టలో ఇలాగే పర్మిషన్​లేకుండా అదనపు అంతస్తులు నిర్మించారని, వాటిపైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. కూల్చివేతలో సెక్షన్ ఆఫీసర్​నర్సింగరావు, బల్దియా సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.