జన్మదిన వేడుకలకు దూరంగా కేటీఆర్

జన్మదిన వేడుకలకు దూరంగా కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కె. తారకరామారావు తెలిపారు. వర్షాలు, వరదల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రేపు (జులై 24న) మంత్రి కేటీఆర్ పుట్టినరోజు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.