'జిన్నా' నుంచి లిరికల్ సాంగ్

'జిన్నా' నుంచి లిరికల్ సాంగ్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జిన్నా'. ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో విష్ణు సరసన నాయికలుగా సన్నీలియోన్, పాయల్ అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. "నా పేరు జిన్నారా.. అందరికీ అన్నరా.. " అంటూ ఈ పాట సాగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ పాటకి ప్రేమ్ సాహిత్యాన్ని అందించగా పృథ్వీ చంద్ర ఆలపించాడు.

ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ జిన్నా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.