ద్రోహుల ఓట్లు నాకక్కర్లేదు: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

ద్రోహుల ఓట్లు నాకక్కర్లేదు: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

పాట్నా: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బిహార్‌‌‌‌లోని అర్వాల్ జిల్లాలో జరిగిన సభలో ఆయన ‘‘నమక్ హరామ్’’ (ద్రోహులు) అనే పదాన్ని ఉపయోగిస్తూ వారి ఓట్లు తనకు అవసరం లేదని పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఒకసారి నేను ఒక మౌల్వీ (మత గురువు)ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ఉందా అని అడిగాను. అతను ఉందని చెప్పాడు. 

నీవు నాకు ఓటు వేశావా అని అడిగితే.. వేశానని చెప్పాడు. కానీ, ఖుదా (దేవుడు) పేరు మీద ప్రమాణం చేయమని అడిగితే.. వేయలేదన్నాడు. ముస్లింలు కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందుతారు కానీ మాకు ఓటు వేయరు. అలాంటి వారిని ‘‘నమక్ హరామ్’’ అంటారు. నేను మౌల్వీ సాబ్‌‌‌‌తో నాకు ‘‘నమక్ హరామ్’’ల ఓట్లు అవసరం లేదని చెప్పాను’’ అని ఆయన అన్నారు.