రైల్వే బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా సూట్ కేస్.. తెరిచి చూసి షాకైన పోలీసులు !

రైల్వే బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా సూట్ కేస్.. తెరిచి చూసి షాకైన పోలీసులు !

బెంగళూరు నగర శివారులో దారుణం జరిగింది. సుమారు 10 ఏళ్ల వయసున్న బాలిక మృతదేహం రైల్వే ట్రాక్స్ పక్కన పడి ఉన్న ఒక సూట్ కేస్లో లభ్యమైంది. దక్షిణ బెంగళూరు పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ బాలికను చంపేసి.. సూట్కేస్లో ప్యాక్ చేసి.. రైలులో నుంచి కిందకు విసిరేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హోసూర్ మెయిన్ రోడ్డులో ఉన్న చందపుర పాత రైల్వే బ్రిడ్జి దగ్గర ఈ మృతదేహం కనిపించింది. చనిపోయిన బాలిక ఎవరనే విషయం ప్రస్తుతానికి తెలియలేదు. ఆమెను ఎక్కడో హత్య చేసి రైలులో నుంచి ఇక్కడ విసిరేసి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

ఆ రైలు పట్టాల పక్కన వెళుతున్న ఒకరికి సూట్ కేస్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు. వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు సూట్ కేస్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్మార్టం అనంతరం కొన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించ లేదని.. ఉరేసి గానీ, గొంతు నులిమి గానీ చంపేసి సూట్ కేస్లో ప్యాక్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ALSO READ | డైలీ మెట్రో రైళ్లలో జర్నీ చేస్తున్నారా..? షాకింగ్ నిజం బయటకి.. ఏమనాలి ఇలాంటోళ్లని..!

బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే బాబా ఈ హత్య ఘటనపై వివరాలు వెల్లడించారు. సూర్యనగర పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఆ సూట్ కేస్లో కేవలం డెడ్ బాడీ మాత్రమే ఉందని, ఐడీ గానీ, వ్యక్తిగత వివరాలను తెలిపేలా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని చెప్పారు. బెంగళూరులో గత మార్చి నెలలో కూడా ఇలాంటి హత్య ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 32 ఏళ్ల వయసున్న గౌరీ అనిల్ సంబేకర్ అనే మహిళ మృతదేహం హుళిమావులోని ఆమె ఇంట్లో ఉన్న సూట్ కేస్ లో దొరికింది. ఆమె భర్తే ఆమెను చంపేసి సూట్ కేస్లో ప్యాక్ చేశాడు.