అదృష్టం ఇదే.. ఒక్క డాలర్ తో పర్సు కొంటే.. లక్షాధికారి అయ్యింది.. 

అదృష్టం ఇదే.. ఒక్క డాలర్ తో పర్సు కొంటే.. లక్షాధికారి అయ్యింది.. 

అదృష్టం ఎప్పుడు ఏ విధంగా తలుపుతడుతుందో ఎవరూ చెప్పలేరు.. కొన్నిసార్లు అదృష్టం కూడా దరిద్రం పట్టినట్లు పడుతుంది అనటానికి ఇదో ఎగ్జాంపుల్.. డాలర్ పెట్టి.. అంటే 80 రూపాయలతో పాత పర్సు కొంటే.. అది లక్షాధికారిని చేసింది ఓ అమ్మాయిని. అమెరికాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ వివరాలు ఏంటో చూద్దాం...

అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన చాండ్లర్ వెస్ట్ అనే మహిళ.. అన్ లైన్ వేలంలో 80 రూపాయలు పెట్టి ఓ పాత పర్సు కొనుగోలు చేసింది. ఇంటికి ఆన్ లైన్ డెలివరీ అయ్యింది. ఏదో కాలక్షేపానికి ఆన్ లైన్ వేలంలో కొనుగోలు చేసిన పర్సు కావటంతో కనీసం ఓపెన్ చేసి కూడా చూడలేదు. అలా నెల రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత ఆ పర్సును ఓపెన్ చేసి చూసింది. చాలా పురాతనమైన పర్సుగా అనిపించింది చాండ్లర్ వెస్ట్ కు..చాలా  వెరైటీగా అనిపించింది. అప్పుడప్పుడు వాడుకుందాం అని దాన్ని తన డెస్క్ లో పెట్టేసుకుంది. 

అప్పటి నుంచి ఆ పర్సుపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుత కాలంలో ఇలాంటి పర్సు ఎక్కడా చూడలేదు.. అలాంటప్పుడు ఇది ఏ కాలానికి చెందిన పర్సు అనేది తెలుసుకోవాలని భావించింది. వెంటనే ఫేస్ బుక్ ద్వారా ఆ పర్సు ఫొటోలు, వివరాలు నమోదు చేసి ఎవరికైనా తెలుసా అని అడిగింది, ఎవరూ తెలియదని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పురాతన వస్తువులు సేకరించే వ్యక్తులు, పురాతన పరిశోధనలు చేసే గ్రూప్ లో ఈ పర్సు వివరాలను పెట్టింది. వాటిని పరిశీలించిన పురాతన పరిశోధన వ్యక్తులు.. ఈ పర్సు వివరాలను పంపించారు. అది లగ్జరీ ఫ్రెంచ్ బ్రాండ్ కార్టియర్ పర్స్ అని.. 1920 నాటిది అని.. అందులో బంగారం, వజ్రాలు ఉండొచ్చని తెలిపారు. వెంటనే బంగారం వ్యాపారుల దగ్గరకు ఆ పర్సును తీసుకెళ్లాలని సూచించారు పరిశోధకులు. 

డాలర్ పర్సు.. ఇంత పెద్ద విలువ చేస్తుందా అనే డౌట్ తోనే చాండ్లర్ వెస్ట్.. ఓ ప్రయత్నం చేస్తే ఏమౌతుందనే ఉద్దేశంతో.. పర్సును నగల వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లింది. అతను పరిశీలించిన తర్వాత షాకింగ్ విషయం చెప్పాడు. ఆ పర్సులో ఉన్నవి రాళ్లు కాదని.. 12 చిన్న చిన్న వజ్రాలు ఉన్నాయని వివరించాడు. ఇప్పటి మార్కెట్ ప్రకారం 4 వేల డాలర్లపైనే వాటి విలువ ఉంటుందని చెప్పాడు అతను. ఎగిరి గంతేసి చాండ్లర్ వెస్ట్.. వజ్రాలు పొదిగిన ఆ పర్సు వివరాలు అన్నీ నమోదు చేసుకుని.. తిరిగి మళ్లీ ఆన్ లైన్ లోనే పురాతన వస్తువుల వేలంలో పెట్టింది. ఊహించని విధంగా 9 వేల 450 డాలర్లకు అమ్ముడుపోయింది. భారతీయ కరెన్సీలో దాని విలువ 7 లక్షల 80 వేలకు అమ్ముడుపోయింది. 

సరదాగా ఆన్ లైన్ వేలంలో పాల్గొనటం ఏంటీ.. డాలర్ పెట్టి కొనుగోలు చేయటం ఏంటీ.. రాళ్లు అని పక్కన పెట్టేసి పర్సుపై ఆసక్తి పెరగటం ఏంటీ.. అవి వజ్రాలుగా మారటం ఏంటీ.. 8 లక్షల రూపాయలు రావటం ఏంటీ.. అంతా వింతగా ఉన్నా.. అదృష్టం ఉంటే ఏ రూపంలోనైనా వస్తుంది అనటానికి ఇదో ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ డిజిటల్ ఫ్లాట్ పాంపై వైరల్ గా మారింది.