
దొంగలొచ్చారంటేనే చాలా మంది భయపడుతారు. అలాంటిది ఓ బాలిక దొంగను పరుగెత్తించింది. అవును పట్టపగలే ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించిన ఓ దొంగను బాలిక వీధుల్లో పరుగెత్తించింది. సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బాలిక చూపిన ధైర్యానికి ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనలో హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో జరిగింది.
ALSO READ : సీఐతో వాగ్వాదం...
కుత్బుల్లాపూర్ చింతల్ భగత్ సింగ్ నగర్ లో పట్టపగలే ఓ దొంగ తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీకి యత్నంచాడు. కింద ఇంట్లో చప్పుడు రావడంతో పైన ఉన్న భవాని అనే బాలిక దొంగను పట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. బాలిక తనను చూడడంతో చోరీకి వచ్చిన దొంగ పారిపోవడానికి ప్రయత్నించారు. బాలిక అడ్డగించడంతో చోరీ చేయకుండానే ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశాడు. అయితే బాలిక ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకునే ప్రయత్నం చేసింది. వీధిలో కొద్ది దూరం దొంగను వెంబడించింది. బాలిక ధైర్యానికి చుట్టుపక్కల కాలనీవాసులు ప్రశంసించారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు.