
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్ ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొదల్లో పడేసిన తల్లిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. రేఖ అనే మహిళ పసికందును పొదల్లో పారేసినట్లుగా వారు గుర్తించారు.
పట్టణానికి చెందిన కృష్ణ అనే లైన్ మెన్ కు రెండో భార్య అయిన రేఖకు ఇప్పటికే ఇద్దరు కొడుకులు. ప్రస్తుతం కృష్ణ తన మొదటి భార్యతో కొడిమ్యాలలో ఉంటున్నాడు. అయితే మళ్లీ గర్భం దాల్చిన విషయాన్ని రేఖ భర్తకు చెప్పలేదు. ఈ ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డ ను ప్రసవించిన రేఖ తన భర్త ఒప్పుకోడనే భయంతో పుట్టి పుట్టాగానే ఆ శిశువును పొదల్లో పారేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగడంతో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ బిడ్డను తల్లిని గుర్తించి, ఆమెను ఎంక్వైరీ చేశారు. దీంతో ఆ మహిళ తానే బిడ్డను పారేసినట్టు ఒప్పుకుంది.