మార్కులు తక్కువ వచ్చినందుకు..తల్లి తిట్టిందని బాలిక సూసైడ్

మార్కులు తక్కువ వచ్చినందుకు..తల్లి తిట్టిందని బాలిక సూసైడ్
  •  రాయదుర్గం పీఎస్ పరిధిలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: ఎగ్జామ్స్​లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లి తిట్టడంతో బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామానికి చెందిన వాసిరెడ్డి సురేంద్ర తన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె మనస్విని(13)తో కలిసి సిటీకి వచ్చి మణికొండ పంచవటి కాలనీలోని ఎస్ఎంఆర్ ఇన్​ఫ్రా హ్యాగింగ్ గార్డెన్స్​లో ఉంటున్నాడు. మనస్విని  నెక్నంపూర్​లోని ఓ ప్రైవేటు స్కూల్​లో 8వ తరగతి చదువుతోంది. ఎగ్జామ్స్​లో మార్కులు తక్కువ వచ్చాయని మంగళవారం సాయంత్రం మనస్వినిని తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన మనస్విని మంగళవారం అర్ధరాత్రి దాటాక అపార్ట్ మెంట్ మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకింది. శ్రీలక్ష్మి గమనించి వెంటనే కూతురిని దగ్గరలోని హాస్పిటల్​కు తీసుకెళ్లింది. అప్పటికే మనస్విని చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎగ్జామ్​లో ఫెయిల్ ​కావడంతో..

జీడిమెట్ల: యువతి సూసైడ్ ఘటన పేట్​బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై రామ్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. దూలపల్లికి చెందిన రామారావు కూతురు పూజిత(22) డిగ్రీలో ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటోంది. ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో బుధవారం బెడ్రూంలో చీరతో ఫ్యాన్​కు ఉరేసుకుంది. తల్లి ఉమాదేవి గమనించి కూతురిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. పూజిత మార్గమధ్యలోనే చనిపోయింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.