- దిగుబడి ఎకరాకు 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలె
- మిల్లర్లు, ట్రేడర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలె
- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ
పెద్దపల్లి: రాష్ట్ర సగటు పత్తి దిగుబడి 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తేమ 20 శాతానికి సడలించాలన్నారు. మిల్లర్లు, ట్రేడర్ల సమస్యలను తక్షణమే పరిష్కరిం చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరు ఆయన ఇక్కడి సమస్యలు వివరిస్తూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాశారు. సీసీఐ ప్రతిపాదించిన రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడాన్ని తప్పుబ ట్టారు. ఈ అంచనా రాష్ట్రంలోని 33 జిల్లా కలె క్టర్లు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమర్పించిన ధృవీకరించిన డేటాకి విరుద్ధమన్నారు.
ఇప్ప టికే తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని, దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పున పరిశీ లించాలని కోరారు. అదే విధంగా పత్తి మిల్లర్లు, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచించిన తేమ నిబంధలను ఎల్ 1, ఎల్ 2 విభజన సమస్య, స్లాట్ బుకింగ్ కష్టాలు, జిన్నింగ్ మిల్లుల కార్య కలాపాల సమస్యలు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సానుకూల చర్యలను ఎంపీ ప్రశంసిం చారు. టోల్ ఫ్రీ హెల్ప్న్, 176 మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు, సీసీఐతో కలిసి జిన్నింగ్ మిల్లుల మ్యాపింగ్, అవగాహన కార్యక్రమాలు రైతులకు మేలు చేస్తాయన్నారు.
