అల్లూరి జిల్లా మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా, ఆయన భార్య రాజక్క ఎన్ కౌంటర్ తర్వాత ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో 200 మంది మావోలు తలదాచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో రాష్ట్రంలో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఏలూరులో 12 మంది మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గ్రీన్ సిటీ లో శివారు భవనంలో వీరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాకినాడలో పట్టుబడిన ఇద్దరిని కూడా ఏలూరు తరలించారు పోలీసులు. నవంబర్ 19న ఏలూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఏలూరులో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనంలోకి అరెస్ట్ అయిన మావోయిస్టు సానుభూతి పరులను తరలించనున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవనంలో అరెస్ట్ అయ్యింది మావోయిస్ట్ టీమ్. నవంబర్ 17న రాత్రి విజయవాడ ఆటోనగర్ లో పట్టుబడిన ఒక మావోయిస్టు ఇచ్చిన సమాచారంతో జరుగుతున్న ఈ అరెస్టులు కొనసాగుతున్నాయని సమాచారం. దీంతో ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు,కాకినాడ, అల్లూరి జిల్లాల్లో మావోయిస్టుల కదిలికలపై పోలీసు బలగాలు ఫోకస్ పెట్టాయి. దీంతో రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
►ALSO READ | మీకు మరో 4 నెలలే టైమ్.. తుపాకులు వదిలి బయటకు రండి: మావోయిస్టులకు కేంద్రమంత్రి బండి పిలుపు
