హైదరాబాద్: మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐబొమ్మ కేసులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరైంది. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానిస్తోన్న ఈడీ ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి లేఖ రాసింది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి నగదు బదిలీలపై ఈడీ విచారణ చేయనుంది.
మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కింగ్ పిన్ ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్పల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. రవి బ్యాంక్ ఖాతా నుంచి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు.
►ALSO READ | కర్ణాటక సంచలనం.. బెంగళూరు వదిలి వెళ్లిపోయేందుకు స్టార్టప్ కంపెనీలకు భారీ ఆఫర్లు..
విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు గుర్తించారు. నెలకు రూ.15 లక్షలు క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. విదేశీ బ్యాంకులు, క్రిప్టో వాలెట్ నుంచి రవికి బదిలీ అయిన లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న ఐబొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.
