అత్యాచార బాధిత కుటుంబానికి డబుల్​ బెడ్రూం ఇల్లు

అత్యాచార బాధిత కుటుంబానికి డబుల్​ బెడ్రూం ఇల్లు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని సైదాబాద్​ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం డబుల్  బెడ్రూం ఇంటిని మంజూరు చేసింది. సైదాబాద్​లోని పిల్లిగుడిసెల కాలనీ లో కట్టిన డబుల్​ బెడ్రూం ఇండ్లలో ఇంటిని కేటాయించింది. ఇంటి తాళాలు, పేపర్లను మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​లు చిన్నారి తల్లిదండ్రులకు బుధవారం అందజేశారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సెప్టెంబర్​ 9న ఆరేండ్ల చిన్నారిని రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రైలు కింద పడి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ టైంలోనే ఫ్యామిలీకి రూ.20 లక్షల సాయం చేయడంతో పాటు తాజాగా ఇంటిని కేటాయించారు.