Prakash Raj: సునితా విలియమ్స్‌తో ప్రకాష్ రాజ్ భేటీ.. 'ఓవర్ ది మూన్' మూమెంట్స్ అంటూ ట్వీట్!

Prakash Raj: సునితా విలియమ్స్‌తో ప్రకాష్ రాజ్ భేటీ.. 'ఓవర్ ది మూన్' మూమెంట్స్ అంటూ ట్వీట్!

కేరళలోని కోజికోడ్ వేదికగా కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ, ఆర్థిక , సాంకేతిక రంగం ప్రముఖులు పాల్గొన్నారు.  వెండితెరపై విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్, అంతరిక్షంలో భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన నాసా వ్యోమగామి సునితా విలియమ్స్  ఈ వేదికపై మెరిశారు.   జనవరి 22 న జరిగిన ఈ భేటీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలు

ప్రకాష్ రాజ్ ఈ అపురూప ఘట్టానికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మన కాలపు అత్యంత ధైర్యవంతురాలైన మహిళను కలవడం, ఆమెతో మాట్లాడటం ఎంతో గర్వంగా ఉంది. ఈ జ్ఞాపకాలు నా మనసును తాకాయి అంటూ భావోద్వేగంతో పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. నా ఇద్దరు ఫేవరెట్ వ్యక్తులు ఒకే ఫ్రేమ్‌లో.. అద్భుతం అని ఒకరు, నా హీరోకే మరో హీరో ఉన్నారా? అని మరొకరు కామెంట్లతో ముంచెత్తారు. ప్రకాష్ రాజ్ తన సినిమాల్లో వాడే ఫేమస్ డైలాగ్ హాయ్ చెల్లంను గుర్తు చేస్తూ అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఊహలే హద్దులు..

ఈ కార్యక్రమంలో సునితా విలియమ్స్ నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చే విషయాలను పంచుకున్నారు.  గతంలో కొత్త ఆవిష్కరణలకు సాంకేతికత అడ్డుగా ఉండేది. కానీ నేడు టెక్నాలజీ ఊహించని వేగంతో దూసుకుపోతోంది. మీ కలలు మీ ఊహలకంటే పెద్దవిగా ఉండాలి. ఈ రోజుల్లో ఊహకు మించిన పరిమితి మరొకటి లేదు. తన మూలాలు భారత్‌లో ఉన్న నేపథ్యంలో, ఇక్కడి ప్రజల మధ్య ఉండటం తనకు ఎంతో గౌరవంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

►ALSO READ | డిజాస్టర్ కూడా రికార్డే: రాజా సాబ్తో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. డార్లింగ్ దరిదాపుల్లో లేని తెలుగు హీరోలు

సైన్స్ పట్ల ప్రకాష్ రాజ్ ఆసక్తి

కేవలం సినిమాలే కాకుండా, దేశ పురోగతి పట్ల కూడా ప్రకాష్ రాజ్ ఎప్పుడూ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలను ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తారు.  కోజికోడ్ సముద్ర తీరంలో జరిగిన ఈ సాహితీ ఉత్సవంలో, ఈ ఇద్దరు దిగ్గజాల భేటీ అక్కడికి వచ్చిన వేలాది మందికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సునితా విలియమ్స్ లాంటి అంతర్జాతీయ స్థాయి వ్యక్తిని కలుసుకున్న ప్రకాష్ రాజ్, ఆ క్షణాలను "ఓవర్ ది మూన్"  అంటూ వర్ణించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.