వరుడి ముక్కు చిన్నగా ఉందని పెళ్లికి నో చెప్పిన వధువు

వరుడి ముక్కు చిన్నగా ఉందని పెళ్లికి నో చెప్పిన వధువు

ఈ మధ్య చిన్న చిన్న కారణాలకే మండపం వరకూ వచ్చిన పెళ్లిళ్లు సైతం ఆగిపోతున్నాయి. మొన్నటికి మొన్న అత్తింటి వారు కొనిచ్చిన లెహంగా నచ్చలేదని, మరొక ఘటనలో పెళ్లి మండపంలో ముద్దు పెట్టుకున్నాడనే కారణాలతో వధువు పెళ్లిని ఆపేసింది. ఇప్పుడు అదే తరహాలో మరొక వివాహంలో వివాదం తలెత్తింది. పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉందన్న రీజన్ తో పెళ్లి కూతురు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పింది. సిల్లీగా అనిపించినా సీరియస్ విషయమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో జరిగింది.

తల్లిదండ్రుల అంగీకారంతో ఆ గ్రామంలో ఓ యువతీ, యువకుడి పెళ్లి నిశ్చయమైంది. అనంతరం వివాహ వేడుకలో భాగంగా వధువు ఇంటికి పెళ్లి కొడుకు కుటుంబం ఊరేగింపుగా వచ్చింది. ఆ సమయంలో అక్కడికొచ్చిన కొందరు వరుడి ముక్కు చిన్నగా ఉందని మాట్లాడుకున్నారు. అది విన్న పెళ్లి కూతురు నిజంగానే అతని ముక్కు చిన్నగా ఉందని భావించి.. ఏకంగా పెళ్లికే నో చెప్పేసింది. తాను వివాహం చేసుకోనని తెగేసి చెప్పేసింది. ఆ తర్వాత కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు ప్రయత్నించినా పెళ్లి కూతురు మాత్రం తన మాట పైనే కట్టుబడి ఉంది.