ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా..ది గర్ల్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌

ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా..ది గర్ల్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌

ది గర్ల్ ఫ్రెండ్’  సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, మూవీ సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నామని  నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి అన్నారు. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలవుతోంది.  ఈ సందర్భంగా నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి  చెప్పిన విశేషాలు.

‘‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ స్ర్కిప్ట్ డెవలప్ చేశారు రాహుల్ రవీంద్రన్.  ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదు. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే ప్రేమ కథ.  ప్రేక్షకులు ఈ కథకు రిలేట్ అవుతారు. తమకు తెలిసిన వారి ప్రేమ కథలు గుర్తొస్తాయి. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక మెసేజ్‌‌‌‌‌‌‌‌ను తీసుకుంటారు.  ఈ స్క్రిప్ట్ పర్సనల్‌‌‌‌‌‌‌‌గా నచ్చడంతో రష్మిక చాలా సపోర్ట్ చేశారు.

 ఇప్పటివరకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు కాబట్టి ఆ కృతజ్ఞతతో ఆమెకు  రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం.  కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అందుకే రష్మికకు జోడీగా స్టార్ హీరోను తీసుకోలేం.   దీక్షిత్ శెట్టి  మంచి పెర్ఫార్మర్.  కన్నడ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కోసం కాకుండా,  ఆ పాత్రకు తను కరెక్ట్‌‌‌‌‌‌‌‌గా సెట్ అవుతాడనే తీసుకున్నాం.  అయితే వీళ్లిద్దరి వల్ల కన్నడలో అడ్వాంటేజ్ అవుతోంది. ఈనెల 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. 

మరోవారం తర్వాత తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం.   సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సెన్సార్ వాళ్ల దగ్గర నుంచి డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నేషనల్ అవార్డ్ దక్కుతుందనే ప్రశంసలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది.  అరవింద్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం’’.